

జనం న్యూస్ మార్చి 19 నడిగూడెం కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం జరుగుతుందని నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దున్న శ్రీనివాస్ అన్నారు.రాష్ట్ర శాసనసభలో ఎస్సీ ల వర్గీకరణను ఆమోదించటం పట్ల బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాల వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్రపౌరసరఫరాల,ఇరిగేషన్ శాఖ మంత్రి,ఎస్సీల వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కోసం 30 ఏళ్ల ఎమ్మార్పీఎస్ సుదీర్ఘ పోరాటంను గుర్తించి మాదిగల చిరకాల వాంఛ అయిన ఎస్సీల వర్గీకరణ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించిందని, ఇప్పుడు బీసీలకు 42 శాతం విద్యా,ఉద్యోగాలలో అవకాశాలు కల్పించేందుకు శాసనసభలో బిల్లు ఆమోదించటం,ఎస్సీల వర్గీకరణ బిల్లు ఆమోదించటం,2026 సంవత్సరంలో జనాభా లెక్కల మేరకు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని తెలియజేయడంతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షపాతిగా రుజువు చేసుకుందన్నారు. ఎస్సీల వర్గీకరణ,బీసీల రిజర్వేషన్ శాతం పెంపుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర మంత్రివర్యులు నలమాద ఉత్తంకుమార్ రెడ్డి,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి రాష్ట్ర మంత్రి మండలి సభ్యులకు ఎస్సీ,ఎస్టీ బీసీ, మైనార్టీలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరివిరాల మాజీ సర్పంచ్ పాతకోట్ల నాగేశ్వరరావు, శ్రీరంగాపురం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గోపాలదాసు గోవిందు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కంభంపాటి శ్రీనివాస్, మాతంగి మాధవరావు, నూకపంగు వెంకటేశ్వర్లు, లంజపల్లి సైదులు,చేకూరి కృష్ణ,విమలపంగు సుదర్శన్,బొడ్డుపల్లి పిచ్చయ్య, పల్లపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.