Listen to this article

సబ్ టైటిల్:    …రుస్తుం, సుప్రసిద్ధ చిత్రకారులు
జనం న్యూస్ :13 జనవరి సోమవారం:తెలంగాణ అస్తిత్వం సిద్దపేట: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు సోమవారం మకర సంక్రాంతి చిత్రాలను ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం,లాంఛనంగా  ఆవిష్కరించిరి. వారు మాట్లాడుతూ ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగలు సంస్కృతి సంప్రదాయాల నిలయాలు సమాజాలను కళావంతం చేస్తాయని సంక్రాంతి ఎవరి హక్కులు వారికి, సక్రమంగా సంక్రమించె నవ్యక్రాంతి మకర సంక్రాంతి. ఈ పండుగకు ఆడపడుచులు అనాదిగా వేస్తున్న రంగు రంగుల ముగ్గులతో, హరిదాసు సంకీర్తనలతో, రుచికర పిండివంటలతో, కొత్త అల్లుళ్ళ మురిపాలతో, పతంగుల కేరింతలతో, జాతర్లలో సంప్రదాయం ఉట్టిపడే ఎడ్లబండి ముస్తాబులతో డూడు బసవన్నల విన్యాసాలతో, సాయంత్రాలు కవిసమ్మేళనాలతో తెలంగాణ సంస్కృతి కలర్ఫుల్ గా తెలుగుజాతి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయని,ఆనందడోలికల్లో మునిగి తేలుతాయన్నారు. నిరుద్యోగాన్ని అధిగమించి ప్రపంచ నలుమూలల ఐక్యత, శాంతి సామరస్యతను పెంపొందించాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఏ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ రుబీనారుస్తుం మహమ్మద్ సాధిక్,  ఎండి రహీం,  తదితరులు పాల్గొని అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.