Listen to this article

జ్వరంతో రోగి వస్తే చాలు ప్రైవేటు డాక్టర్ల పండగే జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లోపం. చికిత్స నిమిత్తం వెళితే చాలు ప్రతిదానికి పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తుల రక్తం పిండేస్తున్న ప్రైవేట్ డాక్టర్స్, ప్రైవేటు డాక్టర్లను ఏమి అనలేని అయోమయ స్థితిలో పల్లె వ్యాధిగ్రస్తులు. జనం న్యూస్,మార్చ్ 19,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్,గ్రామంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు మెడికల్స్, వ్యాధిగ్రస్తులు జ్వరంతో ఆస్పత్రులకు బారులు తీరడంతో ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు ఇష్ట రాజ్యంగా పీజులు పెంచి,జనాల వద్ద నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారని వ్యాధిగ్రస్తులు అయ్యో దేవుడా అని తల పట్టుకుంటున్నారు.ఆ డాక్టర్లు చదివిన చదువు ఏంటో,వారు చేసే వైద్యం ఏంటో ఆ దేవదేవుడినే తెలియాలి.జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు కనీసం మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఆసుపత్రి చుట్టే తిరుగవల్సి వస్తుందని, అయినప్పటికీ జ్వరం తగ్గడం లేదని వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నరు. ఆస్పత్రి కోక్క మెడికల్.. మెడికల్ లైసెన్సులు ఒక్కరివి,ఔసదాలు ఇచ్చేది మరొకరు… సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా మండలానికి వచ్చి ప్రైవేట్,ఆస్పత్రులను, మెడికల్స్ లను జిల్లా వైద్యాఆధికారులు తనఖీ చేసిన దాఖలాలు లేవని ఇక్కడి ప్రజలు గుసగుసలాడుతున్నారు.ఆస్పత్రుల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని, కనీసం,త్రాగడానికి నీళ్లు ఉండవని అంటున్నారు. మందు మాత్రలు మింగాలన్న,దాహం వేసిన,సుమారు మీటర్లు దూరం వరకు వచ్చి త్రాగు నీళ్లు కొనుక్కొని వెళ్లాల్సిందేనని వ్యాధిగ్రస్తులు అంటున్నారు.డాక్టర్ శంకర్ పాటిల్,ను సంప్రదించగ వారు మాట్లాడుతు బిల్లులు ఖచ్చితంగా అవ్వుతాయని, బిల్లులు చెల్లించాల్సిందే నని తెలిపారు.
ఆర్ఎంపి డాక్టర్ల మని కొత్త కొత్త ఆస్పత్రులను ప్రారంభిస్తున్నారు.తీరా చుస్తే,ఇంకొక డాక్టర్ చేతి కింద కాంపౌండర్ గా పనిచేస్తే చాలు,నేను డాక్టర్ అని వ్యాధిగ్రస్తులకు వైద్యం చేస్తున్నరని కొందరు వాదిస్తున్నారు అందరికి ఒకే చోట వైద్యం… మహిళలకు,పురుషులకు ఒక్కటే చోట పక్క పక్క బెడ్స్ పై వైద్యం చేస్తున్నారని తెలియపర్చారు