Listen to this article

జనం న్యూస్ 20మర్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రామ్ బద్రునిపల్లి గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు ప్రేమ పేరుతో వేధించగా అట్టి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. పెగడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెగడపల్లి మండలం రాంబద్రుని పల్లి గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలిక మండలంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది ఈ క్రమంలో రాంభద్రుని పల్లి కి చెందినటువంటి బాస రాము మరియు రంగదామునిపల్లి చెందిన మరొక వ్యక్తి ఇద్దరు కలిసి మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, ప్రేమించకపోతే పరువు తీస్తానని భయభ్రాంతులకు గురి చేయడంతో అట్టి వేధింపులు తాళలేక మైనర్ బాలిక శనివారం నాడు పురుగుల మందు త్రాగగా అది గమనించిన మైనర్ బాలిక తల్లి మొదటగా జగిత్యాలలోని శ్రద్ధ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని గుడ్ లైఫ్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతున్న క్రమంలోనే ఈరోజు బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకు మృతి చెందినట్లు మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బి.ఎన్.ఎస్ మరియు ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెగడపల్లి ఎస్సై సిహెచ్ రవి కిరణ్ తెలిపినారు.