

DR NTTPS కాలువల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు.
యాజమాన్యం వారు కెనాల్స్ కి ఇరుప్రక్కల భద్రత చర్యలు తీసుకోక పోవడంమే కారణమా..?
జనం న్యూస్ కొండపల్లి మున్సిపాలిటీ : DR NTTPS కెనాల్ యాజమాన్యం వారు కనీసం ఒక కిలోమీటర్ మేర కుడా కెనల్స్ కి పెన్సింగ్ వేసి చర్యలు చేపట్టలేదని ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలింగ్ కెనాల్, మరియు హీట్ కెనాల్ కి ఇరువైపులా భద్రతా చర్యలు చేబడితే కొన్ని ఆత్మ హత్యలు చేసుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. కూలింగ్ కెనాల్ లో ఇటీవల వరుసగా చాలా మంది ఆత్మ హత్య చేసుకోవడానికి కూలింగ్ కెనాల్ ని ఎంచుకొని Dr nttps కూలింగ్ కాలువలో దూకి ఆత్మ హత్య చేసుకోవడం జరుగుతుంది. అంతే కాకుండా ఇటీవల ఖాజీ మాన్యం అనుకోని ఉన్న వేడి నీళ్ల కాలువలో ఆట ఆడుకుంటు తెలియక చిన్నపిల్లలు కాలువలో పడి మరణించడం జరిగినది. చాలా మంది ఉన్నపాటుగా వెళ్లి కాలువలో దూకి ఆత్మ హత్య చేసుకొంటున్నారు. ఇదిలా ఉండగా యాజమాన్యం వారు కూలింగ్ కెనాల్ మరియు హీట్ కెనాల్ కి ఇరువైపులా పెన్సింగ్ వేసి భద్రతా కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.