


తెలంగాణ రాష్ట్రంలో,ఆస్తి పన్ను 100 % వసూలు చేసి, 1 స్థానం జమ్మికుంట మున్సిపాలిటీ.. 2 స్థానం సాధించిన హుజురాబాద్ మున్సిపాలిటీ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరో రికార్డు..ఇదే పంథాను పథకాల అమలు,సంక్షేమ పథకాల్లో కొనసాగించాలని కోరిన వోడితల ప్రణవ్.. జనం న్యూస్ // మార్చ్ // 20 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జమ్మికుంట,హుజురాబాద్ మున్సిపాలిటీలు మరో రికార్డును సొంతం చేసుకున్నాయి.ఆస్తి పన్ను వసూలు విషయంలో జమ్మికుంటకు మొదటి స్థానం రాగా,హుజురాబాద్ కు రెండవ స్థానం వచ్చింది,దీనిపట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జమ్మికుంట,హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లను అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు ప్రత్యేకంగా అభినందిచారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల విషయంలో ఇదే పంథాను కొనసాగిస్తూ సంక్షేమం విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ప్రజలకు,ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉంటూ మరింత భాద్యతగా ఉండాలని తెలిపారు.రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని దానికోసం ఇప్పటినుండే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కోరారు.