

జనం న్యూస్,మార్కెట్ 21,(పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఈ రోజు సుల్తానాబాద్ మండలం లోని సుద్దాల గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి పథకాలపై జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ ఉద్దేశించి మాట్లాడారు. లేబర్ కార్డు, సుకన్య సమృద్ధి యోజన, సురక్ష భీమా యోజన, ఆటల్ పెన్షన్ యోజన, జీవన జ్యోతి యోజన, మహిళ చట్టాలపై మరియు హక్కుల గురుంచి వివరిస్తూ, మహిళ సాధికారత దిశగా ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. అత్యవసర సమయంలో ఉపయోగించాల్సిన టోల్ ఫ్రీ నెంబర్ల గురుంచి తెలియజేశారు. ఋతు క్రమం మరియు పరిసరాల పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శ్రీమతి కె. కృష్ణవేణి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీమతి పి. స్వరూప, సీనియర్ మేట్ నరేష్ మరియు గ్రామీణ మహిళలు పాల్గొన్నారు.