Listen to this article

జనం న్యూస్ మార్చి 20( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) భీమవరం బిజెపి తూర్పు, పడమర పట్టణ అధ్యక్షులు ఎన్నికను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్ణయాల్లో భాగంగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు 50 బూతులు దాటితే ఒక మండలం గా ఏర్పాటు చేసుకోవాలని పార్టీ తీసుకున్న నిర్ణయం లో భాగంగా, భీమవరం 100 బూతులు దాటిన కారణంగా పార్టీ సౌలభ్యం కోసం పట్టణాన్ని తూర్పు పట్టణం మరియు పడమర పట్టణంగా విభజించి బుధవారం ఆయా మండలాలకి అధ్యక్షులు నిర్ణయించే కార్యక్రమంలో భాగంగా భీమవరంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ఆర్. ఓ మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ సమక్షంలో ఎన్నిక జరిగిందనీ తెలిపారు. తూర్పు మండలానికి అడబాల శివ, పడమర మండలానికి వబిలిశెట్టి ప్రసాద రావు లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా బిజెపి అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, భీమవరం అసెంబ్లీ కన్వీనర్ కాయిత సురేంద్ర, పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిలు అల్లూరి సాయి దుర్గ రాజు, కోమటి రవి, అసెంబ్లీ కోకన్వీనర్ చేరుకూరి కృష్ణంరాజు పర్యవేక్షణలో ఎన్నుకోవడం జరిగినది.