

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మహాత్మా జ్యోతిబాఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల (బాలికలు), నందలూరు నందు 5వ, 6వ మరియు ఇంటర్మీడియట్ తరగతులలో ప్రవేశాలకు గడువును మార్చి 15 నుండి మార్చి 25 వ తేదీ వరకు పొడిగించడమైనది. ఔత్సహికులు mjpapbcwreis.apcfss.in వెబ్సైటు నందు పొందు పరిచిన ఖాళీలను చూసి దరఖాస్తు చేసుకోగలరని ప్రిన్సిపాల్ నాగేశ్వరి తెలిపారు. నందలూరు పాఠశాల మరియు కళాశాల యందు అధునాతన పద్దతిలో అనుభవజ్ఞులు అయినటువంటి ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన, ఉచిత కంప్యూటర్ విద్యా, లైబ్రరీ, లాబ్స్, సబ్జెక్టు క్లబ్స్, రుచికరమైన మరియు పౌష్ఠిక ఆహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడా పోటీలకు తర్ఫీదు మరియు విశాలమైన క్రీడా ప్రాంగణం వంటి సదుపాయాలు కలవు. ముఖ్య గమనిక ఏమనగా ఆన్లైన్ లో అప్లై చేసి పరీక్ష రాసి ఉతీర్ణులైన వారికీ మాత్రమే పాఠశాలలో మరియు కళాశాలలో అడ్మిషన్స్ ఇవ్వబడును.