Listen to this article

జనం న్యూస్ మార్చి 20 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామ పరిధిలో గల అక్రమ కట్టడాలను గురువారం ఉదయం ఇంద్రేశం గ్రామపంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో కూల్చివేతలు నిర్వహించారు. ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో జి ప్లస్ టు పర్మిషన్లు పొంది జి ప్లస్ ఫోర్ కట్టడాలను నిర్వహిస్తున్నారని ఫిర్యాదు మేరకు అక్రమ కట్టడాలను కూల్చి వేశామని ఇంద్రేశం గ్రామపంచాయతీ ఈవో సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.