

బిచ్కుంద మార్చి 20 జనం న్యూస్ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న బిచ్కుంద మున్సిపాలిటీ లో గోపనపల్లి గ్రామమును విలీనం చేయు నిర్ణయమును వెనక్కి తీసుకోవాలని కోరుతూ మేము గోపనపల్లి గ్రామ పంచాయతీ వాసులము మండలము బిచ్కుంద జిల్లా కామారెడ్డి తెలంగాణ స్టేట్ ….. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మేజర్ గ్రామపంచాయతీని నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయబోతున్నట్లు అందులో భాగంగా బిచ్కుంద మండల పరిధిలో గల మా యొక్క గోపనపల్లి గ్రామమును మరియు మా గోపనపల్లి గ్రామపంచాయతీని ఇట్టి బిచ్కుంద మున్సిపాలిటీలో ప్రభుత్వం విలీనం చేయబోతున్నట్లుగా వార్తా మాధ్యమాల ద్వారా పత్రికా కథనాల ద్వారా మేము తెలుసుకొంటిమి. ప్రభుత్వం యొక్క ఇట్టి నిర్ణయం మా గ్రామస్తులందరికీ ఆశ్చర్యానికి విస్మయానికి గురిచేసినది. ప్రభుత్వం యొక్క ఈ విలీన నిర్ణయాన్ని మా గ్రామస్తులు ఎవరికీ సమాచారం లేకుండా అలాగే మా గ్రామ ప్రజల యొక్క సమ్మతి లేకుండా ఏకపక్షంగా నిర్ణయించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నాం మా యొక్క గోపనపల్లి గ్రామమును బిచ్కుంద మున్సిపాలిటీలో కలిపే నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ గ్రామస్తులందరూ సమావేశమై ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగింది. బిచ్కుంద మండలంలో ఎంతో ప్రత్యేకత గుర్తింపు అస్తిత్వం చైతన్యం కలిగిన మా గోపనపల్లి గ్రామమును గ్రామపంచాయతీని బిచ్కుంద మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని మా గ్రామం యొక్క అస్తిత్వాన్ని తొలగించడం గానే భావిస్తూ మా గ్రామస్తులందరి మనోభావాలకు అభిప్రాయాలకు విరుద్ధమైన నిర్ణయం గా మా గ్రామ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని భంగపరిచే ప్రజా వ్యతిరేక నిర్ణయంగా భావిస్తూ ప్రభుత్వం యొక్క ఇట్టి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే ఉపసంహరించుకుని మా గోపనపల్లి గ్రామపంచాయతీని యధావిధిగా కొనసాగిస్తూ మా గ్రామం యొక్క అస్తిత్వాన్ని భౌగోళిక స్వరూపాన్ని గుర్తింపును గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటూ గ్రామస్తులందరూ సమిష్టిగా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగినది.
