

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్ మార్చ్ 20, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండల పరిధిలో మేడిపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగానే ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తన సిబ్బంది అయినా చైతన్య,అనిల్,సాదు నాయక్ లతో పాటు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో చెరువు కట్ట సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరియు మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో అయ్యారు మొత్తంగా ఏడుగురు వ్యక్తుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనది అని ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు, పేకాట ఆడిన వారి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు, 2 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ మరియు 12,500/- నగదు సీజ్ చేశామని చెప్పారు