

జనం న్యూస్ మార్చ్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి సాంకేతికతను ఉపయోగించుకోవడానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు హర్షనీయమని అన్నారు. బిల్ గేట్స్ తో ఒప్పందం వల్ల ఆరోగ్య సంరక్షణ, మెడెటెక్, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాలలో ఆంధ్రప్రదేశ్ గేట్స్ ఫౌండేషన్ సహకరించనున్నదని ఆయా రంగాలలో ఖర్చు ఇతర పరిష్కారాలను సమగ్ర పరచడంతో ప్రజా సంక్షేమం కోసం సాంకేతికను ఉపయోగించడంలో చంద్రబాబు నాయుడు కే సాధ్యమని వెంకటరావు అన్నారు. బిల్ గేట్స్ ఒప్పందం వల్ల ప్రిడిక్టివ్ హెల్త్ అనలిటిక్స్ ఆటోమేటెడ్ డయాగ్నెటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI ) ఉపయోగించడం జరుగుతుందని ఏఐ ఆధారిత పాలన, మానవ మూలధనం అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యలో సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగించడంతో ఈ అవగాహన ఒప్పందం రాష్ట్రానికే నమూనాలను సృష్టించి ఫలితాలను సాధిస్తుందని వెంకటరావు అన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బ్రస్టు పట్టించి అన్ని రంగాల్లో కుదేలు చేశారని, ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో దార్శినికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలివి తేటలతో ఐటి రంగంతో తనకున్న ప్రతిభతో రాష్ట్ర పురోగతికి చంద్రబాబు నాయుడు కీలకమయ్యారని ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమని వెంకటరావు అన్నారు. ఈ కార్యక్రమంలో భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ రాష్ట్ర పెన్షనర్ అసోసియేషన్ కార్యదర్శి బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.