Listen to this article

జనం న్యూస్ మార్చ్ 20 సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పురపాలక సంఘం పరిధిలోని గుమ్మడిదల శ్రీమల్లికార్జునస్వామి వారిజాతర మహోత్సవం మార్చి 23 ఆదివారం నుంచి 26 బుధవారం వరకు యాదవ సంఘం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ములగోవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా ఆలయ నిర్వాహకులు ఆహ్వానం పత్రికను అందజేశారు.సోమవారం నాడు కల్యాణోత్సవం సందర్భంగా సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ములగోవర్ధన్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు మల్లేష్ యాదవ్, కిష్టయ్య యాదవ్, ప్రమోద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, చంద్ర రెడ్డి, సుధాకర్ రెడ్డి, సూర్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తుడుము రవి సంఘం సభ్యులు పాల్గొన్నారు.