

జనం న్యూస్ 21మార్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తడగొండ సాగర్ 10వ,తరగతి విద్యార్థులకు పరీక్ష కి అవసరమైన పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు,పెన్సిల్ లు అందించినాడు. విద్యార్థులు 10వ తరగతి లో మంచి మార్కులతో ఉత్తీర్నత సాధించి స్కూల్ కి గ్రామానికి ముఖ్యంగా తల్లిదండ్రులకు లకు మంచి పేరు తీసుకురావాలని భవిష్యత్ లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు .