

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు TD జనార్ధన్ ను కలిసిన AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి CPI సుభాని త్వరలో AIYF నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తెలంగాణలో హోంగార్డ్ ఉద్యోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్థానికతకు చెందిన వారిని స్వరాష్ట్రానికి తీసుకురావాలని కోరుతూ టిడిపి రాజకీయ కార్యదర్శి, పోలీట్ బ్యూరో సభ్యులు TD జనార్ధన్ ను కలిసి వినతి పత్రం అందజేసిన ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి CPI సుభాని. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపడం జరిగిందని, ఒక్క హోంగార్డ్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ చెందిన వారు తెలంగాణలో, తెలంగాణకు చెందిన వారు ఆంధ్రప్రదేశ్లో ఉండిపోవడంతో వారి కుటుంబ సభ్యులతో కూడా సమయం గడపలేని పరిస్థితి ఉన్నందున వారు ఆవేదన చెందుతున్నారని సుభాని తెలిపారు. పెద్ద వయసులో ఉన్న వారి తల్లిదండ్రులు చూసే దిక్కు లేక మానసికంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు. తెలంగాణలో చదువుతున్నటువంటి వారి పిల్లలు కూడా స్థానికతను కోల్పోయే అవకాశం ఉందని ఉన్నారు. ఈ విషయాలు టీడీ జనార్దన్ గారికి వివరించగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.