

జనం న్యూస్ 20మార్చి. కొమురం భీమ్ జిల్లా. స్టాఫ్ రీపోటర్. కె ఏలియా. ఆసిఫాబాద్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనీ పాండి కూపర్ లింగో ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క గురువారం ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా గొండ్వాన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గొండ్వాన ఫౌండేషన్ చైర్మన్ సిడాం తిరుతి, ప్రధాన కార్యదర్శి కుర్సెంగ మారుతి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.