Listen to this article

జనం న్యూస్ మార్చి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా నేటి సమాజంలో ధైర్యం కలవారి ఎంతటి విజయాన్ని అయినా సాధించగలుగుతారని, మార్షల్ ఆర్ట్స్ విద్య నేటి సమాజానికి ఎంతో అవసరమని స్థానిక ఎస్సై నర్సింలు, నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం చిట్కుల్ గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఇందులో పాఠశాలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థినిలు పాల్గొని బెల్టులు, సర్టిఫికెట్లు అందుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు విద్యార్థులు చేసిన ప్రదర్శనలను తిలకించారు. అనంతరం వాళ్లు మాట్లాడుతూ.. పాఠశాలల్లో గత ఐదు నెలలుగా మార్షల్ ఆర్ట్స్ లో కఠినంగా విద్యను సాధన చేసి బెల్టులు అందుకోవడం ప్రశంసనీయమన్నారు. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకురావాలని వారు కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ అంజలి, గ్రాండ్ మాస్టర్ పోచయ్య మాస్టర్లు మురళి సుప్రియ మహేష్ గౌడ్ విష్ణువర్ధన్ సింధు ప్రణవి నాగేశ్వరి పి ఈ టి శారద ఉపాధ్యాయులు పాల్గొన్నారు