

బి సి లకు అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్ బిల్లు ను ప్రవేశ పెట్టిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాజేడు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లె డేనార్జున్ మార్చి 20 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటి సారిగా కుల జనగణన చేసి 56 శాతం ఉన్న బీసీ లకు విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయాలలో 42 శాతం రిజర్వేషన్ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టి ఏక గ్రీవంగా ఆమోదింపచేసినందుకు వాజేడు మండలంలోనే అత్యధిక బీసీ జనాభా ఉన్న ధర్మవరం గ్రామంలో బీసీ లందరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోల్లె డేనార్జున్ రావు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి జై కాంగ్రెస్ అంటూ నినాదాలు ఇస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నూగురు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పూనెం రాంబాబు ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరారపు సర్వేశ్వర రావు,సేవాదళ్ ఉపాధ్యక్షుడు ధనిశెట్టి రాంబాబు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి మురహరి ,కట్ల నరసింహారావు, నల్లగాసి రమేష్, బొల్లె దేవేంద్రమూర్తి,బంధం కృష్ణ, బొల్లె భాస్కర్, మిరియాల రమణయ్య ,తోట సత్యం, తుండే రాజబాబు, తొంగలి సత్యనారాయణ, పాత్రికేయుడు కొత్తగట్టు రాము తదితరులు పాల్గొన్నారు
