Listen to this article

జనం న్యూస్ మార్చ్ 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి గ్రీవెన్స్ తప్పనిసరిగా స్వీకరించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు నిర్వహించిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం నుంచి పార్టీ క్యాడర్ తో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలి. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కార్యకర్తల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, అన్ని విభాగాలలో కార్యక్రమాలు బాగా చేసిన వారిని అభినందించడం. మీటింగ్ అనంతరం మినిట్స్ కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలి. ప్రతి నెల ఇన్చార్జ్ మంత్రులు తమకు కెటాయించిన జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించాలి. మొదటి రోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలి. రెండవ రోజు పార్లమెంట్ అధ్యక్షులు, జోనల్ కో ఆర్డినేటర్లతో కలిసి పార్టీ క్యాడర్ సమావేశం ఏర్పాటు చేయాలి. మీటింగ్ యొక్క మినిట్స్ కేంద్ర పార్టీ కార్యాలయంకు పంపించాలి. ఎవరైనా మీటింగ్స్ ను నిర్వహించని యెడల లిఖిత పూర్వక వివరణ ఇవ్వవలసి ఉంటుంది. కె ఎస్ ఎస్ సి యు బి కమిటీలు ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలి. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ఉన్న మెయిన్ కమిటీలు, అనుబంధ కమిటీలను ఏప్రిల్ 30వ తారీకు లోపల పూర్తి చేయాలని తాతయ్య బాబు తెలిపారు.