

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పార్టీ మారడానికి కారణం జగన్మోహన్ రెడ్డియే. గౌరవం దక్కనిచోట ఉండకూడదని నిర్ణయించుకున్నాం: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పార్టీ పెట్టారని,తన అధికారాన్ని వదిలేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాను అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నారు. గురువారం మర్రి నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఆయనమాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ కోసం అధ్యక్షులుగా ఉండి అహర్నిషులు కృషి చేశానని తెలిపారు. 2019లో తనకు టికెట్ ఇస్తామని చెప్పి మాజీ మంత్రి విడ దల రజనీకి ఇచ్చారు. గెలిపించుకుని వస్తే మంత్రి పదవి ఇస్తామని తన పాదయాత్రలో భాగంగా కళామందిర్ సెంటర్లో ప్రజల సాక్షిగా చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఇస్తామనే మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటా వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారని తన ఆవేదన వ్యక్తం చేశారు.2024లో కాబట్టి మనోహర్ నాయుడు కి టికెట్ ఇచ్చి గెలిపించమని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డాను ఆ తరువాత గుంటూరులో 58 వేల ఓట్ల పైచిలుకతో ఓడిపోయిన రజినినీ తీసుకొచ్చి ఇన్ చార్జ్ పదవి కట్టబెట్టారు. తనకు ఇన్చార్జి పదవి దసరా (విజయ దశమి)కిస్తామని చెప్పి ఆమెకు ఇచ్చారన్నారు. సుమారు 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న తనకు దగ్గవలసిన గౌరవం దక్కలేదు, పార్టీలోకి మారడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డియే అని మర్రి పేర్కొన్నారు. మా మామయ్య సోమేపల్లి వెంకటసుబ్బయ్య, నా అభిమానులు, శ్రేయోభిలాషులకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే కాకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు. వారి కోరిక మేరకు గౌరవం దక్కనిచోట ఉండకూడదని టిడిపిలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాం. పార్టీ కి రాజీనామా చేస్తున్నాను, తన రాజీనామాను జగన్మోహన్ రెడ్డి ఆమోదింప చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గేరా లింకన్, బైరా వెంకట కోటి, షేక్ అలీమీయా, సాతులూరి కోటి,తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.