

జనం న్యూస్ 20 మార్చి, వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండులో ఈరోజు 5 నూతన ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన, డిసిసి అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, పరిగి టు షాద్నగర్ రెండు ఆర్టీసీ బస్సులు, మరియు పరిగి టు మహబూబ్నగర్ రెండు బస్సులు, పరిగి టు హైదరాబాద్ ఒక బస్సు ప్రారంభించారు. త్వరలో ఇంకా నూతన ఆర్టీసీ బస్సులు వస్తాయని అన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను వివిధ గ్రామాల లబ్ధిదారులకు అంద చేసిన పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.