

నేటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్బంగా పది విద్యార్థులకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సత్య రాజ్ ఉపారపు పలు సూచనలు
జనం న్యూస్ మార్చ్ 20 జిల్లా బ్యూరో ఆకాశంలో ఆలల మాదిరిగా వెళ్లే పక్షులు అను కున్న గమ్యం చేరే వరకు పరుగు ఆపవన్న ట్లుగా… పదోతరగతి విద్యార్థులు సైతం పరీక్షలు ముగిసే వరకు పుస్తకాలతో అలుపెరగని
పోరాటం చేస్తుంటారు. పదేళ్లపాటు చదివిన విద్యాభ్యాసంలో పబ్లిక్ పరీక్షలకు హాజరుకావడం వారికి ఇదే మొదటిసారి.రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులపై
తల్లిదండ్రుల బాధ్యతను తెలియజేస్తూ పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మరియు
విద్యార్థులపై తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకో వాలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సత్య రాజ్ ఉపారపు గారి సూచనలు… విద్యార్థులు నిత్యం 6-8 గంటలు నిద్రపో యేలా చూడండి. చదువుకునేందుకు ప్రశాంత వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి. సహచర పిల్లల చదువుతో పోల్చుతూ.. వీరిని చులకనగా చూడకండి. బాగా సన్నద్ధమవుతున్నావు.. మంచిగా రాస్తావని ప్రోత్సహించాలి. వేరే కేంద్రంలో పరీక్షలు
రాయడం కూడా విద్యార్థులకు కొత్తే. వారిలో సహజంగానే ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. బాలలు పరీక్షలు ప్రశాంతంగా రాసేలా వెన్నంటి నిలవాలి. ప్రణాళిక ప్రకారం నిద్రపోయేలా చూడటం, లేపడం, సమయానికి ఆహారాన్ని అందించడం వంటివి తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాలి. మార్కులు ముఖ్యం కాదని, చదివిన వాటిని జ్ఞాపకం పెట్టుకొని పరీక్షలు బాగా రాయాలని ప్రోత్సహించాలి. పరీక్షల వేళ కొత్త విషయాలు చదివి ఆందో ళన చెందకుండా.. చదివిన అంశాలను పునశ్చ రణ చేసుకునేలా చూడాలి.విద్యార్థులకు ఇంటి పనులు అప్పగించడం, శుభకార్యాలకు తీసుకెళ్లడం, వారి ముందు ఘర్ష ణలకు దిగడంలాంటివి చేయొద్దు.
ఇంట్లో సమస్యలను వారి ముందు చర్చిం చొద్దు. పరీక్షలు ముగిసే వరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సానుకూల దృక్పథంతో వ్యవ హరించాలి. సందేహాలు, అర్థం కాని విషయాలను ఉపా ధ్యాయులను అడిగి తెలుసుకోవడంలో విద్యార్థు లకు సహకరించాలి. ఏకాగ్రత కోసం వారిని ఉదయం లేదా సాయంత్రం కొంత సేపు ఆడుకోనివడం ధ్యానం, యోగా సాధన వంటివి చేసేలా ప్రోత్సహించాలి. మార్కెట్లోని జంక్ఫుడ్, బయటి ఆహారాన్ని నియంత్రించాలి.