Listen to this article

జనం న్యూస్ మార్చి 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట చార్లేట్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అద్యక్షులు జాటోతు డేవిడ్ రాజు ఆధ్వర్యంలో మునగాల మండలం ఎస్సై ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా మునగాల మండల కేంద్రంలోని స్థానిక ట్రినిటీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్ధులకు పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల జీవితానికి మూలస్తంభం లాంటిదని పట్టుదల క్రమశిక్షణ అలవర్చుకొని శ్రద్ధగా చదువుకొని పదవ తరగతిలో మంచి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మస్తైర్యంతో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, మంచి మార్కులతో విజయాలను అందుకోవాలని అన్నారు.విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.చార్లేట్ చారిటబుల్ పౌడేషన్ అద్యక్షులు డేవిడ్ రాజు మాట్లాడుతూ సెల్ పోన్ కంటే పుస్తకము భవిషత్ ను తీర్చి దిద్దుకుంది తెలిపారు. జాతీయ మానవ హక్కుల సమైఖ్య మీడియా ప్రతినిధి దుర్గం ప్రభాకర్ పదవ తరగతి విద్యార్ధులను ఆశీర్వదించారు.చారిటబుల్ జనరల్ సెక్రటరీ జాటోతు శేఖర్ విద్యార్ధులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధినేత జానకీ వనజ, ప్రిన్సిపాల్ ముల్లంగి జాకబ్ రాజు, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఉపాద్యాయ బృందం తదితరులు పాల్గోన్నారు.