

పారని కాల్వలు..
అందని సాగునీరు..
ఎండుతున్న పంటలు
జనం న్యూస్, మార్చ్ 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)జగదేవపూర్ సాగునీరదంక పంటపొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అండగంటిపోవడం.. కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో ఆరుగాలం పడిన కష్టం వృథా అవుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని రాష్ట్ర మాజీ ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో పెండింగ్ లో ఉన్న కెనాల్ పనులను రైతులతో కలిసి గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి పరిశీలించారు, ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి,మాట్లాడుతూ గతంలోని కెసిఆర్ ప్రభుత్వం కొండ పోచమ్మ సాగర్ నుండి మునిగడప చెరువు వరకు కాల్వపములను 99 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు కేవలం ఒక్క శాతం పనులంటే రెండు ప్యాచెస్ పనులు పెండింగ్లో ఉన్నాయి, 40 నుండి 50 గజాలు బ్రిడ్జి కట్టి కెనాల్ ను పూర్తి చేస్తే మునిగడప చెరువులకు నీళ్లు వచ్చి నిండుతదన్నారు మునిగడప చెరువు నింపుతే గొల్లపల్లి, మాందాపూర్ దౌలాపూర్ బస్వాపూర్ తిమ్మాపూర్ చాట్లపల్లి, వట్టిపల్లి 10 నుండి 15 గ్రామాల చెరువులను నింపి ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీరును అందించడం జరుగుతుందన్నారు. చెరువులను నింపడం వలన భూగర్భ జలాలు పెరుగుతాయి అన్నారు. దాదాపు ఈ కెనాల్ నాలుగు కిలోమీటర్ల పొడవు ఉందని చుట్టూ ఉన్న పంటలకు బోర్ల ద్వారా రైతులు సాగునీరును పంట పొలాలకు పారించుకోవచ్చని తెలిపారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం కెనాల్ పనులను 99% పూర్తిచేస్తే ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క శాతం పనులను కూడా చేయడం లేదని మండిపడ్డారు, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి రైతుల పొలాలను ఎండబెడుతుందన్నారు, ఇరిగేషన్ ఈఎంసి కి, మరి ( ఎస్సీ)కి ( డి ఈ) కి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న, ఫోన్ చేసిన, వినతి పత్రాలు అందజేసిన స్పందించడం లేదని తెలుపుతూ రైతులకు మాత్రం సాగునీరు వదలడం లేదని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించడానికి గజ్వేల్ నియోజకవర్గ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడానికి గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టులను నిర్మాణం చేసి కాలువల నిర్మాణం చేయడం జరిగిందన్నారు, అక్కడక్కడ కాలువల పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కానీ ప్రస్తుత కాంగ్రెస్ అసమర్ధ ప్రభుత్వం 15 నెలలు గడుస్తున్న కనీసం కాలువలలో తట్టడు మన్ను కూడా తీయకుండా పనులను పెండింగ్లో ఉంచి రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతాంగానికి సాగునీరు అందించడానికి గతంలోని కేసీఆర్ ప్రభుత్వం ఇరిగేషన్ ఆఫీస్ ను గజ్వేల్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడానికి గజ్వేల్ లో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో కొడంగల్ కు తరలించకపోవడం దారుణం అన్నారు. అంతేకాకుండా గజ్వేల్ లో కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణానికి మరియు రాజీవ్ రహదారికి అనుసంధానం చేస్తూ గజ్వేల్ నియోజకవర్గం లోని అన్ని రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చారన్నారు గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో ఆర్ అండ్ బి ఈఈ ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగింది కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ అండ్ బి ఆఫీస్ ను కూడా కొడంగల్ తరలించుకపోవడం చాలా దారుణం అన్నారు.రాజకీయ లబ్దికోసం కెసిఆర్,ని విమర్శించడం పనికిరాని మాటలు మాట్లాడడం కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి వారసులకు అలవాటైందని తెలిపారుగజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి కలెక్టరేట్ నుండి రాజ్ భవన్ కు పాదయాత్ర పెట్టుకోవడం సిగ్గుచేటు అని ఎద్దేవ చేశారు,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన 420 హామీలను అమలుకాని ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచే విధంగా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, నర్సారెడ్డి గాని పాదయాత్ర చేస్తే కలెక్టరేట్ నుండి గాంధీభవన్ కు కానీ లేదా సెక్రటేరియట్ రేవంత్ రెడ్డి, చాంబర్ వద్దకు కానీ పాదయాత్ర చేసి ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా మీ ముఖ్యమంత్రి కి తెలుపాలని సూచించారు.గతంలోని కెసిఆర్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 180 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక వాటిని రద్దు చేయడం చాలా దారుణం అన్నారు, నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు, తిరిగి 180 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయమని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ రేవంత్ రెడ్డి, చాంబర్ వరకు వరకు పాదయాత్రలు చేసే మేం కూడా మీతో కలిసి వస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి,తెలిపారుగతంలోని కేసీఆర్ ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు ల కింద ఉన్న కాలువల నిర్మాణం కోసం డబ్బులను మంజూరు చేయడం జరిగింది, అన్నారు వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి, ఇంటికి పాదయాత్ర చేయలని సూచించారు.అంతేకాకుండా గజ్వేల్ నియోజకవర్గం లో దాదాపు 10000 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు అన్నారు, రైతుల పక్షాన పోరాడుతూ కలెక్టరేట్ నుండి గాంధీభవన్ వరకు లేదా సెక్రటేరియట్ రేవంత్ రెడ్డి, చాంబర్ వరకు వరకు పాదయాత్ర చేసి మిగిలిన 10,000 మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తే మేము కూడా మీతో కలిసి వస్తామని హితవు పలికారు,రేవంత్ రెడ్డి కనువిప్పు కలిగేలా గజ్వేల్ లో ఉన్న పెండింగ్ పనులు పూర్తిచేసేలా రైతు రుణమాఫీ చేసేలా 180 కోట్లు తిరిగి మంజూరు చేసే వరకు కలిసి పోరాటం చేద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలిపారు,అంతేకాకుండా ఇక్కడి నుండి ఇరిగేషన్ ఆఫీస్, మరియు ఆర్ అండ్ బి ఎస్ సి ఈఈ ఆఫీసులు కొడంగల్ నుండి గజ్వేల్ కు తిరిగి వచ్చేవరకు సెక్రటేరియట్ ముట్టడించి రేవంత్ రెడ్డికి కనువిప్పు కలిగేలా పాదయాత్ర చేద్దామని సలహా ఇచ్చారు గత కేసీఆర్ ప్రభుత్వం, అసంపూర్తిగా ఉన్న పనుల కోసం నిధులను మంజూరు చేసిందన్నారు కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించి కొడంగల్ కు, తరలించిందన్నారు పెండింగ్లో ఉన్న పనుల పునరుద్ధరణ కోసం నిధుల కోసం సెక్రటేరియట్ ని ముట్టడించి రేవంత్ రెడ్డి, నిధులు మంజూరు చేసేంతవరకు మేము మీతో కలిసి వస్తామని మీరు పాదయాత్ర చేసిన ఇంకా ఏ యాత్ర చేసిన మేము మీతో కలిసి వస్తామని హితవు పలికారు ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది మీ ప్రభుత్వం ఉంది మీకు దమ్ము ధైర్యం ఉంటే గత ప్రభుత్వం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయల నిధులను తిరిగి తీసుకురావాలన్నారు, రుణమాఫీ కానీ 10000 మంది రైతులకు రుణమాఫీ చేయించాలన్నారు, కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ కింద ఉన్న కాలువల నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు,ఇక్కడి నుండి తరలించుకుపోయిన ఆఫీసులను తిరిగి తీసుకు రావాలని డిమాండ్ చేశారు ఈరోజు మీరు తలపెట్టిన పాదయాత్ర చూస్తా ఉంటే పనిలేని వాళ్లు పిల్లి తలకాయ తిన్నట్టు మీ వ్యవహార శైలి ఉందన్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారా లేదా అధికారపక్షంలో ఉన్నారా మీకే అర్థం కావడం లేదని మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు, కేవలం కేసీఆర్ ను తిడితే పదవులు ఇస్తారని పదవులు వస్తాయని ఆశపడుతూ పాదయాత్రల పేరిట ప్రజలను మోసం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మీకు ప్రజలు బొంద పెడతారని తెలిపారు, కెసిఆర్ పై మాట్లాడే నైతికత మీకు లేదని తెలిపారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధకుడు కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ వన్ గా ఉంచిన నాయకుడు కేసీఆర్ అన్నారు, ఒక గజ్వేల్ నియోజకవర్గం లోనే దాదాపు పది సంవత్సరాలలో ₹10,000 కోట్ల అభివృద్ధి సంక్షేమ పనులను ప్రజలకు అందించిన ఘనత కెసిఆర్ ది అన్నారు గజ్వేల్ నియోజకవర్గం లో మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ లాంటి నిర్మాణాలు చేసి రైతాంగానికి సాగునీరు అందించారన్నారు, ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేశారన్నారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేశారన్నారు, పరిపాలన సౌలభ్యం కోసం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ నిర్మాణం చేశారన్నారు గజ్వేల్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేశారన్నారు, తెలంగాణకే తలమానికంగా గజ్వేల్ కు మణిహారంగా ములుగులో అగ్రికల్చర్ కళాశాల ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఇంటికి నల్లగా సురక్షితమైన త్రాగునీరు అందించారన్నారు, గజ్వేల్లో మంచి ఆహ్లాదమైన వాతావరణం కోసం అర్బన్ పార్కును ఏర్పాటు చేశారన్నారు , డబుల్ రోడ్ల నిర్మాణం చేశారన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు,నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి గజ్వేల్ ను అభివృద్ధి చేయలని డిమాండ్ చేశారు,ఇప్పటివరకు ఏ ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టారని ప్రశ్నించారు,గజ్వేల్ అభివృద్ధిని కెసిఆర్ 50 సంవత్సరాలు వరకు ముందుకు తీసుకువెళ్లారన్నారు అలాంటి మహాశక్తి మీద మాట్లాడే నైతిక హక్కు అర్హత కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాదయాత్ర చేసిన నాయకులకు లేదని ప్రతాప్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష నర్సారెడ్డి ఎక్కడ ఉన్నారో చెప్పాలని తెలిపారు. అధికారం రాగానే పదవుల కోసం పాకులాడుతూ అధిష్టానం దగ్గర మెప్పు పొందడానికి పాదయాత్రని డ్రామాకు తెరలేపారని ఎద్దవా చేశారు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు గ్రూపులు ఉన్నాయని తెలిపారు ఏ గ్రూపు ఎప్పుడు ఎవరిని తిడుతుందో వాళ్లది వాళ్లకే సత్యత లేదని తెలిపారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మోసం చేసిన విషయం కాంగ్రెస్ నాయకులకు తెలుసు అన్నారుకాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అమలుకొని ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఇచ్చిందన్నారు వాటిని అమలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి వరకు పాదయాత్ర పెట్టి వాటిని అమలు చేయించాలని డిమాండ్ చేశారు, నీ బూటకపు పాదయాత్రను ప్రజలు ఎవరు నమ్మరున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు, ప్రజలు మిమ్మల్ని చీకుడుతున్న మీకు బుద్ధి రావడంలేదని మండిపడ్డారు, మీరు పాదయాత్రలు చేసిన మోకాల యాత్రలు చేసిన మీతో ఒరిగేది ఏమీ లేదని తెలిపారు, కెసిఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని తెలిపారు, మీరు తలపెట్టే పాదయాత్ర కాదు మేము చేసే పాదయాత్రకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం గజ్వేల్లో దాదాపు 10,000 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, మల్లన్న సాగర్ నిర్వాసితులకు 10% ప్యాకేజీలు పెండింగ్లో ఉన్నాయన్నారు వాటి మీద మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ రేవంత్ రెడ్డి,చాంబర్ వరకు పాదయాత్ర చేస్తామని అప్పుడు మాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి గజ్వేల్ నుండి తీసుకుపోయిన 180 కోట్ల నిధులను మంజూరు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ అలేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పని గట్ల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీల పురం జిల్లా మాజీ అధ్యక్షులు కిరణ్ గౌడ్, ఇటిక్యాల సర్పంచ్ శేఖర్, జగదేపూర్ ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, పీర్ల పల్లి నుండి మాజీ సర్పంచ్ యాదవ్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు తదితరులున్నారు.