

జనం న్యూస్ మార్చి 21 అమలాపురం( ాజోలు, ) ఈనెల 23న చాకలిపాలెం కృష్ణబాలాజీ ఫంక్షన్హాల్నందు మెగా ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేసినట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచర్ల వెంకట్రా వు(బాబి) తెలిపారు. ఈరోజు తాటిపాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబి మాట్లాడుతూ ఈ పరిచయ వేదికకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలనుండి సుమారు 650 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆర్యవైశ్య వధూవరులు పద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాసు శ్రీను, లక్కింశెట్టి బాబులు, కుసుమంచి పాపారావు, కంచర్ల కృష్ణమోహన్, గ్రంధి గణేషుప్తా, నాళం కిట్టు, పువ్వాడ కృష్ణ, పేకేటి సతీష్, సింగంశెట్టి కుమార్, వారణాసి నివాస్గుప్తా, పోశెట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.