Listen to this article

జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం స్థానిక సుంకర పేట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్స్వం సదస్సు జరిగింది. సుంకర పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. సుజాత గారు మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ద్వారా మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఇలాంటి అవగాహన సదస్సులు విద్యార్థినీ విద్యార్థులకు చాలా అవసరమని ఆహారం తినే ముందు ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రపరుచుకోవాలని ఆమె తెలిపారు. విజయదుర్గ యూత్ సొసైటీ ప్రెసిడెంట్ కేశవపట్నం చంద్రిక మాట్లాడుతూ నోటి పరిసుభ్రత గురించి పిల్లలకి అలానే ప్రజలకి అవగాహన కల్పించడం ద్వారా వారు ఎలాంటి అనారోగ్యలకు గురికాకుండా ఉంటారు అని ఆమె తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర యూత్ వాలెంటైర్ డి శ్రావణి గారు మాట్లాడుతూ ఏవైనా వ్యాదులు నోటి ద్వారానే వ్యాప్తి చెందుతాయని. అందుకే ప్రతి ఒక్కరు రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి.సుజాత గారు, సుబ్రహ్మణ్యం గారు, సింహాద్రి గారు, హెల్త్ ఇన్స్ట్రక్టర్ ధనలక్ష్మి గారు, విజయ దుర్గ యూత్ సొసైటీ ప్రెసిడెంట్ కేశవపట్నం చంద్రిక చందు గారు, నెహ్రూ యువ కేంద్ర యూత్ వాలంటీర్లు డి .శ్రావణి గారు జై.హేమలత గారు పాల్గొన్నారు.