

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా ఎస్పీ ఎంతో ఛాలెంజ్ గా డ్రక్స్ వ్యవహారంలో పోరాడుతున్నారని చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న ఆటో యూనియన్ నాయకులతో కలసి డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్ను ఆవిష్కరించి డ్రగ్స్ పై ఆటో యూనియన్ నాయకులకు డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని డ్రగ్స్ అమ్మే చోటు ఎక్కడైనా ఉంటే అది పోలీస్ వారికి తెలియజేయాలని సిఐ రమేష్ తెలిపారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఏవైనా సమస్యలు ఉంటే అర్బన్ స్టేషన్ కి వస్తే వాటి సమస్యలను పరిష్కరించేలా చేస్తానని ఆటో యూనియన్ నాయకులకు సిఐ రమేష్ హామీ ఇచ్చారు. అనంతరం సీఐ రమేష్ మీడియాతో మాట్లాడుతూ తక్కువ ఖర్చుకే డ్రగ్స్ వస్తుందని యువత అంతా డ్రగ్స్, గంజాయి మత్తులో పడి తన జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారన్నారు. ఒక కుర్రవాడు డ్రగ్స్ చేతి గోరులో పెట్టుకుని తీసుకున్న వాటిని ఎవరు కనిపెట్టలేరన్నారు. డ్రగ్స్ ను పూర్తిగా అంతం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటామన్నారు. డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలా ఏ మత్తు పదార్థాలు ఏవైనా ఎక్కడైనా అమ్మినట్లు ఎవరికి తెలిసినా వారు పోలీస్ వారికి కానీ 1972 టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియజేస్తే త్వరగా మత్తు పదార్థాల నుంచి యువతను, సమాజాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉండుదన్నారు. అదేవిధంగా డ్రగ్స్ త్వరగా నాశనం చేయడానికి వీలుంటుందని సీఐ రమేష్ తెలియజేశారు. కార్యక్రమంలో అర్బన్ ఎస్సైలు శివరామకృష్ణ, చెన్నకేశవులు, రహంతుల్లా, మరియు ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.