Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను శిరసా వహిస్తూ 2019 ఎన్నికల్లో పార్టీ నాయకుల, కార్యకర్తలు, ప్రజల అభిమానంతో గెలిచాను,2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయమని చెప్పారు. దురదృష్టవశాత్తు ఓడిపోయాను, పార్టీ అధికారంలోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైయస్సార్ కుటుంబం మోసం చేసిందని చెప్పడం బాధాకరమని, కృష్ణ, గుంటూరు జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించి అందలం ఎక్కించిందని, ఆ తదుపరి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిందని, అటువంటి కుటుంబం పైన.. నాయకుని పైన అలా మాట్లాడటం పట్ల విచార వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై శాసనమండలిలో ప్రస్తావించలేదని, కష్ట కాలంలో పార్టీ ఉన్నప్పుడు విడిచి వెళ్లిపోవడంపై ఆత్మ విమర్శ తీసుకోవాలన్నారు. ఓడిపోయిన ఆమెకు ఇన్చార్జి పదవి ఇవ్వడం ఏమిటని మర్రి రాజశేఖర్ చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా నేను చిలకలూరిపేట ఇన్చార్జిగా రావడం జరిగిందన్నారు. వైయస్సార్ పార్టీలో దక్కని గౌరవం టిడిపిలో దక్కాలని ఆశిస్తున్నాను అన్నారు.