Listen to this article


జనం న్యూస్ మార్చి 21 అమలాపురం పి గన్నవరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ ధ్యక్షుడు కంచర్ల వేంకట్రావు (బాబి) పిలుపు పి. గన్నవరం మండలం చాకలిపాలెం శ్రీ కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 23 వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబి కార్యదర్శి కుసుమంచి పాపారావు, కోశాధికారి కంచర్ల కృష్ణమోహన్ లు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు బయోడేటా రిజిష్టర్ చేయించుకున్న ఆర్యవైశ్య యువతీ యువకులు తమ తల్లి తండ్రి తో తప్పనిసరిగా పాల్గొనాలని వారుకోరారు అన్ని అవకాశాలు ఉండి ఆర్యవైశ్యులకు పెళ్లి కుదరడం లేదనేవారి కుటుంబాలలో ఆనందం నింపాలనే ఓమంచి ఉద్దేశంతో పూర్తి సేవా దృక్పథంతో గత రెండు నెలలుగా ఈ కార్యక్రమము జిల్లా సంఘము, వధూవరుల పరిచయ వేదిక కమిటీ అహర్నిశలు కృషి చేస్తుంది కావున బయోడేటా రిజిష్టర్ చేయించుకున్న యువతీ యువకులు తప్పనిసరిగా పాల్గొనాలని వారు కోరారు ఒక బయోడేటా రిజిస్టర్ చేసుకున్న వ్యక్తితో పాటు మరొక ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని అన్నారు ఈ సమావేశంలో గ్రంధి గణేష్ గుప్తా, లక్కింశెట్టి బాబులు, పోశెట్టి సూరిబాబు, వారణాసి గుప్తా, కాసు శ్రీను సింగంశెట్టి కుమార్ నాళం కిట్టు, పేకేటి సతీష్, పువ్వాడ కృష్ణ కాసు శ్రీను, తదితరులు పాల్గొన్నారు