

నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటా.. పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్..
జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట//కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు నగదు బియ్యం పంపిణీ చేశారు. కోరపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ పరశురాములు గౌడ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లె ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వాహకులు మృతుడి కుటుంబానికి శుక్రవారం నాడు ( 5000 )ఐదు వేల నగదుతో పాటు( 50 ) కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన గుండారపు
ధనలక్ష్మి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందగా వారి కుటుంబానికి ( 50 )కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవి గౌడ్, గండి రంజిత్ కుమార్ గౌడ్, గిరవేన రాజయ్య యాదవ్ , బిక్షపతి యాదవ్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
