

రైతుల కోసమే సహకార సంఘం పనిచేస్తుంది: సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ 31 లోపు వన్ టైంతో ఎల్ టి రుణం చెల్లించుకొని సద్వినియోగం పరుచుకోండి: విండో కార్యదర్శి మద్నూర్ మార్చి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో వ్యవసాయ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఎరువులు పనిముట్లు అందించాలని వ్యవసాయ రైతులు డిమాండ్ చేశారు. మద్నూర్ సింగల్ విండో 56వ మహాజనసభ శుక్రవారం సంఘ భవనంలో సంఘం చైర్మన్ శ్రీనివాస్ పటేల్ అధ్యక్షతన జరిగింది. ఇట్టి సభలో మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ.. వచ్చే వానాకాలం పంట సాగు కోసం రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందించడానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ.. వ్యవసాయ రైతుల అవసరాల కోసమే సహకార సంఘం పనిచేస్తుందని, రైతులకు అవసరమయ్యే విత్తనాలు ఎరువులు, సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంఘం కార్యదర్శి జె బాబురావు పటేల్ మాట్లాడుతూ.. ఎల్ టి రుణాలు పొందిన వ్యవసాయదారులు వన్ టైంతో చెల్లించుకునే అవకాశాన్ని రుణ రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని, మహాజనసభలో తెలియజేశారు. సభలో కార్యదర్శి ఆదాయం ఖర్చుల వివరాలు చదివి రైతులకు వినిపించారు. మహాజనసభ సదాసీదాగా ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు వ్యవసాయ రెతులు సంఘం సిబ్బంది పాల్గొన్నారు.