

జనం న్యూస్,మార్చి 21,అచ్యుతాపురం: విజయవాడ ఆర్&బి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అనకాపల్లి నుండి అచ్యుతాపురం రహదారి అభివృద్ధి పనులు చేయడం కోసం ఈరోజు అధికారులతో చర్చించారు.త్వరలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.