Listen to this article

జనం న్యూస్, మార్చి 22 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) నెహ్రూ యువ కేంద్ర, పెద్దపల్లి జిల్లా, భారత ప్రభుత్వము క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెహ్రు యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో తేదీ:21-03-2023 రోజు జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం జె ఎన్ టీ యూ ఆఫ్ ఇంజనీరింగ్ మంథని లో నిర్వహించబడింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏజీఎం ఎర్రన్న మరియు జిఎం సింగరేణి రెస్క్యూ కే శ్రీనివాస్ రెడ్డి పెద్దపల్లి మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి యువ ఉత్సవ్ వేడుకలు చేసుకుంటున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోటీలు కూడా ఈరోజు నెహ్రు యువ కేంద్ర పెద్దపల్లి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, ఈ పోటీలలో పాల్గొంటున్న యువతీ యువకులకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచంలోనే భారత దేశము భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని అన్నారు, ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశమని యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యపడుతుందని అన్నారు. నేటి యువకులు మంచి విద్యతోపాటు ఆరోగ్యానికి ఉపయోగపడే క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు సంగీతము యోగా లాంటి అంశాలలో కూడా పాల్గొనాలని అన్నారు.నేటి యువత క్రమశిక్షణతో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడితే అనుకున్నది సాధించి వారి కుటుంబానికి దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు.ఈ యువ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఎంపీడీవో శైలజ వివిధ పోటీలలో గెలుపొందిన ప్రధమ, ద్వితీయ, తృతీయ అభ్యర్థులకు సర్టిఫికెట్స్ మెమొంటోస్ మరియు నగదు బహుమతులను అందజేసినారు.యువత ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర పెద్దపల్లి జిల్లా యువజన అధికారి ఏం వెంకట్ రాంబాబు జిల్లా యువజన ఉత్సవాల గురించి వివరించడం జరిగింది.అదే మాదిరిగా నెహ్రూ యువ కేంద్ర కార్యక్రమాలను వివరించినారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో 21 మంది వివిధ పోటీలకు సంబంధించిన జడ్జీలు, ఎన్ఎస్ఎస్ అధికారులు, ఎన్ఎస్ఎస్ క్యాడేట్స్, ఎన్ వై కే వాలంటీర్స్, 300 మంది విద్యార్థినీ విద్యార్థులు యువతి యువకులు పాల్గొనడం జరిగింది. ఎం.వెంకట్ రాంబాబు, జిల్లా యువజన అధికారి, నెహ్రూ యువ కేంద్ర, పెద్దపల్లి జిల్లా.