

జనం న్యూస్ మార్చి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం కోసం సువెన్ ఫార్మాసిటికల్ కంపెనీ సహకారంతో అక్షర ఫౌండేషన్ ఆద్వర్యంలో షూ,టై, బెల్టు, నోటుబుక్సు,పరీక్ష పాడ్స్ వంటి స్టడీ స్టేషనరీ పంపిణీ చేయడం అభినందనీయమని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి అన్నారు. శుక్రవారం మునగాల మండల పరిధిలోని నరసింహలగూడెం హైస్కూల్లో సువెన్ ఫార్మాసిటికల్ కంపెనీ సహకారంతో అక్షర ఫౌండేషన్ వారు ఇచ్చిన స్టడీ స్టేషనరీని ప్రధానోపాధ్యారాలు అనురాధ అధ్యక్షతన సభ ఏర్పాటు చేసి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు చదువులో రాణించడం కోసం సువేన్ కంపెనీ మరియు అక్షర ఫౌండేషన్ విద్యార్థులకు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఉన్నత ఆశయాలతో లక్ష్య సాధన వైపు పయనించాలని అన్నారు. చదువులు మెరుగైన ప్రతిభ కనబరచడం కోసం ఇలాంటి సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు.జిల్లాలోని మారుమూల గ్రామాల విద్యార్థులను చదువులో వెన్ను తట్టి ప్రోత్సహించడం కోసం సువెన్ ఫార్మసిటికల్ కంపెనీ ఇలాంటి సేవలు చేయడం సంతోషకరమని అన్నారు. నరసింహులగుడెం హైస్కూల్ విద్యార్థులకు స్టడీ స్టేషనరీని ఇచ్చినందుకు సువెన్ కంపెనీకి మరియు అక్షర ఫౌండేషన్ నిర్వాహకులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గోళ్ళమూడి రమేష్ బాబు,తూము శ్రీనివాసరావు,మిట్ట గడుపుల ప్రకాశం,ఏలె హరికృష్ణ, బొల్లేద్దు శ్రీనివాస్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
