

జనం న్యూస్ మార్చి 21 సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడలోని ఎస్.కె. బృందావన్ బ్యాంకెట్ హాల్ లో వసుధ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలు సమాజంలో ప్రతి రంగంలో ముందుకు వెళ్లాలి, తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. మహిళల ఎదుగుదలకు అనుకూలమైన విధానాలను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు.