Listen to this article

జనం న్యూస్,మార్చి 21,అచ్యుతాపురం: నేటి కాలంలో రక్తదానం మహాదానంగా నిలుస్తుంది. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తున్నది. రక్తదాతలు ప్రాణదాతలు. మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మరోకరికి ప్రాణదానం చేసినవారవుతారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మార్చి 23 ఆదివారం ఉదయం 9 గంటల నుండి స్థానిక ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీ నందు రెడ్ క్రాస్ వారి సహకారంతో మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,ఉత్తరాంధ్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సతీష్ కుమార్ ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్నారని అలాగే మార్చి 27న మొక్కలు నాటే కార్యక్రమం ఉదయం 9గంటలు నుండి జరుగునని అఖిల భారత రామ్ చరణ్ యువత లాలం చందు ఒక ప్రకటనలో తెలిపారు.