Listen to this article

జనం న్యూస్ మార్చి 21(నడిగూడెం ) ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రజల దాహార్తిని తీర్చేందుకు నడిగూడెం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నడిగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి ఎలకా ఉమారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఎంపీడీవో దాసరి సంజీవయ్య శుక్రవారం రంభించారు.వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లటి త్రాగునీటిని అందించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని నడిగూడెం పంచాయతీ కార్యదర్శి ఉమారాణిని ఎంపీడీవో అభినందించారు. కార్యక్రమంలో ఎంపీఓ విజయకుమారి, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.