

జనం న్యూస్ మార్చి 21(నడిగూడెం) తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేసి, ప్రశ్నించే గొంతుకులను అడ్డుకుంటుందని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సిపిఎం నాయకులను నడిగూడెం పోలీసులు శుక్రవారం ముందస్తు చేసి స్టేషన్ తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సిఐటియు మండల కన్వీనర్ మల్ల వెంకన్న, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కాసాన్ కిషోర్,గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు చిమట నాగరాజు,డివైఎఫ్ఐ నాయకులు జమ్మి ఎల్లయ్య ఉన్నారు.