

జనం న్యూస్ మార్చ్ 21 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో గల 993 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో గల 10 అక్రమ కట్టడాలను శుక్రవారం అమీన్పూర్ రెవెన్యూ అధికారులు జెసిబి సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో నిర్మాణం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కూల్చివేతల్లో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.