

— రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల
జనం న్యూస్ జనవరి 13 కొత్తగూడెం నియోజకవర్గ
పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పర్వదినం భోగి పండుగ అని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.అత్యంత వైభవంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ ముందు రోజు నిర్వహించే భోగి పండుగ సందర్భంగా సోమవారం తెల్లవారుఝామున పాత పాల్వంచ బస్ట్ స్టాండ్ వద్ద జరిగిన భోగి మంటల వేడుకల్లో కొత్వాల పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కష్టాలను దహించేవి భోగి మంటలు అన్నారు. సీతాకాలపు చల్లటి గాలులు చీల్చుతూ వెలిగించే భోగి మంటలు ప్రజల జీవితాల్లో సరికొత కాంతులు తీసుకురావాలని కొత్వాల అన్నారు.ఈ కార్యక్రమంలో వంశి హోటల్ శ్రీనివాస్, గుమ్మడివెళ్లి సత్యనారాయణ, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, మహిళలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.