Listen to this article

జనంన్యూస్ మార్చి 21 వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రారం ముత్యం దార జలపాతం సమీపంలో బాంబు పేలడంతో ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణమూర్తి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు. అయ్యాయి. బొంగు కర్రల కోసం అటవీకి వేల్లడంలో ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు.ఈ ఘటనలో గాయపడ్డా ఒకరిని 108 లో ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. కాలు పూర్తిగా డ్యామేజ్ కావడంతో ప్రధమ చికిత్స చేసిన వైద్యులు వరంగల్ ఎంజీఎం కు రిఫర్ చేశారు. మరో ముగ్గురు వ్యక్తులు సోడి నరసింగరావు, పూసూరి రాజేష్, కోసం ఎడమయ్యా, వీరు ముగ్గురు దూరంగా ఉండడంతో వారికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.