

జనంన్యూస్ మార్చి 21 వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ఈరోజు వెంకటాపురం మండలం ఇప్పలగూడెం (z) సర్వేనెంబర్ 25 ,27 అక్రమ పట్టాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రామిల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ లో మెమరాండం ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్ 25 అక్రమ పట్టాదారి ఖమ్మం పట్టణం నివాసి దచేపల్లి సూర్య కుమారి కి 25 సర్వే నెంబర్లు విస్తీర్ణం 14 – 20 ,27 సర్వే 9-52 సర్వేకు పాత్ర పురం గ్రామం నివాసి దూడ సుదర్శన్ రెడ్డి కి సర్వేనెంబర్ 26 లో విస్తీర్ణం 12. 2 సెంట్లకు రామచంద్రపురం, అంకన్న గూడెం, వీరభద్రారం గ్రామాలకు చెందిన గిరిజనేతరుల గత 50 సంవత్సరాలుగా గోదావరి నదిలో లంక భూములను సేద్యం చేసుకుంటూ జీవిస్తున్న భూములపై గిరిజనేతరులు అయినా దచేపల్లి సూర్య కుమారి ,దూడ సుదర్శన్ రెడ్డి సుమారు 45 ఎకరాల్లో అక్రమ పద్ధతుల్లో చట్టాలకు విరుద్ధంగా పట్టాదారి పాసుపుస్తకాలు తయారు చేసుకుని నేడు ఇసుక ర్యాంపులకు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మైనింగ్ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా గోదావరి నదిలో సుమారు నాలుగు కిలోమీటర్లు 4 అడుగుల వెడల్పుతో సూర్యకుమారి దూడ సుదర్శన్ రెడ్డి కంకరతో రోడ్డు నిర్మాణం చేపట్టారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రామేల్ల రాజశేఖర్ ఈరోజు వెంకటాపురం మండలం తాసిల్దార్ ఆఫీసులో వేమరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నోముల శ్రీ కిషన్ పాల్గొనడం జరిగింది