

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 21 : ఏన్కూరు మండల విద్యాశాఖ అధికారిగా రహీంబి ని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ నియమించారు. ప్రస్తుతం రహీంబి తిమ్మారావుపేట హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఎంఈఓ గా పనిచేసిన శ్రీనివాస్ గత నెల 28న పదవీ విరమణ చేశారు. 20 రోజులపాటు ఎంఈఓ గా ఎవరిని నియమించలేదు. ఎట్టకేలకు రహీంబి ని ఎంఈఓ గా నియమించారు