

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
జనం న్యూస్ మార్చి 21, 2025:. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :జిల్లాలు చేపట్టిన నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైనూర్ మండల సమాఖ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనకు కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత సమయంలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. తరగతి గదిలో విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును పరిశీలించి, విద్యార్థుల పఠన సామర్ధ్యాలను పరీక్షించారు. అనంతరం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్మిస్తున్న కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. మార్కెట్ యార్డ్ కు వచ్చే రైతులు, ప్రజల సౌకర్యార్థం నిర్మించడం జరుగుతుందని, పనులను త్వరగా పూర్తి చేసి ఉపయోగం లోకి తీసుకురావాలని తెలిపారు. మండలంలోని మార్లవాయి గ్రామపంచాయతీ పరిధిలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక బద్ధంగా నీటిని అందించేందుకు కార్యచరణ రూపొందించాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని అందించలేని ప్రాంతాలలో వాటర్ ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా త్రాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

