

జనం న్యూస్-జనవరి 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
తెలుగు వారికి పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. మూడు రోజులు సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను తెలుగు వారు ఘనంగా నిర్వహిస్తారు. నందికొండ మున్సిపాలిటీలోని స్థానిక హీల్ కాలనీలో తొలి రోజు భోగి పండుగ సందర్భంగా కాలనీల్లో కాంతలు కొలువు తీరి ఇంటి ముంగిట సిరులు చెందే రంగు రంగుల రంగవల్లులతో ముగ్గులు వేయడం తో ఈ పండగ ప్రారంభమయింది . దీంతో సోమవారం తెల్లవారు జామున భోగి మంటలతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. వేకువజామునే పిల్లలు, పెద్దలు, మహిళలు వీధుల్లో, ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాడుతూ, డ్యాన్సులు వేశారు. దీంతో కాలనీ వీధులలో భోగి పండుగ సందడి వాతావరణం నెలకొంది.