Listen to this article

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం
(అంగర వెంకట్)
రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన 52 మంది టీడీపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు  సమక్షంలో సోమవారం టీడీపీ లో చేరారు. పార్టీలో చేరిన వారిలో నల్లమిల్లి అనిల్ రెడ్డి, నల్లమిల్లి అయ్యప్ప గౌతమ్ రెడ్డి, నల్లమిల్లి అమ్మిరెడ్డి, కర్రి శ్రీనివాసు, యేలేటి నాగరాజు, చవిలే రాముడు, సైనం వీర్రాజు, ఎడ్ల చిన్న, పచ్చిమాల ముసలయ్య, పచ్చిమాల చిన్ని, బళ్ళ రమణ, దండంగి సూర్యప్రసాద్, దండంగి సత్తిరాజు, చవిలే శేఖర్, చవిలే ప్రసాద్, ఎడ్ల జాను, పచ్చిమాల విజయ్, పచ్చిమాల ప్రవీణ్, ఏలేటి మున్నా, ఏలేటి సునీల్, గంటి శేషారావు, ఈండ్ర రవి, దండంగి సతీష్, దండంగి నాగేశ్వరరావు, పచ్చిమాల బుజ్జిబాబు, గంటి నరేష్, పితాని శివ, దోనేపూడి సతీష్, దోనేపూడి కుమార్, దోనేపూడి రామకృష్ణ, దంగేటి వెంకన్న, యాల్లె వెంకటరమణ, మహిపాల రాజు, డి.సూరిబాబు, దంగేటి వెంకటప్రసాద్, పితాని అప్పన్న, రాయుడు శివ, రాయుడు రాము, వాసంశెట్టి ప్రకాష్, జుత్తుగ శ్రీను, దంగేటి రాంబాబు, కడలి సత్యనారాయణ, పెంకే వరప్రసాద్, చెల్లూరి శేఖర్, కుందేటి త్రిమూర్తులు, నమ్మి ముత్యం, డోకుబుర్ర సురేష్, వాసంశెట్టి లక్ష్మణరావు, తాటికుండ శ్రీరామ్, కాట్ర లక్ష్మణరావు (చిన్న), నూలు గణేష్, నక్క సూరిబాబు లు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం సుమారు రూ.2 లక్షల రూపాయలతో నిర్మించిన గోకులం షెడ్డు ను మరియు సంక్రాంతి సంధర్బంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్.పి.టి.సి కర్రి వెంకటకృష్ణారెడ్డి, రామచంద్రాపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు మల్లిడి సూర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనసూరి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి నల్లమిల్లి వెంకన్నబాబు, నల్లమిల్లి సతీష్ రెడ్డి, కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, బుంగ పెద్ద, కొల్లి చంటిబాబు, మల్లిడి అమ్మిరెడ్డి, పడాల సత్యనారాయణరెడ్డి (గంగిబాబు), పోతంశెట్టి సత్యనారాయణరెడ్డి, తదితర్లు పాల్గొన్నారు.