Listen to this article

జనం న్యూస్ మార్చి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వి కెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటిజం పిల్లల కోసం ప్రత్యేక ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. జయనగర్ కాలనీ, కూకట్పల్లి, మేడ్చల్ జిల్లా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆటిజం పిల్లలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి కి చేందిన కంటి వైద్యులు పిల్లల కంటి ఆరోగ్యాన్ని పరీక్షించి, వారికి అవసరమైన చికిత్సా సూచనలు అందజేశారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోడు పంపిణీ చేయడంతో పాటు, పిల్లల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాన్ని అందించారు. వి కెన్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ, “ఆటిజం పిల్లలు ప్రాపర్ కేర్ తీసుకోగలిగితే వారి జీవన నాణ్యత మెరుగవుతుంది. కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా వారిలో మెరుగైన అభివృద్ధిని చూడవచ్చు” అని తెలిపారు.
కీలక అంశాలు: ఆటిజం పిల్లలకు ఉచిత కంటి పరీక్షలు అవసరమైన వారికి ఉచిత కళ్లజోడు పంపిణీ
ప్రత్యేక వైద్య సలహాలు కంటి ఆరోగ్య సూచనలు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వి కెన్ ఫౌండేషన్ మరియు సహకరించిన ఎల్ వి ప్రసాద్ వైద్య బృందానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.