Listen to this article

బేస్తవారిపేట ప్రతినిధి, మార్చి 22, (జనం న్యూస్):- సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గిద్దలూరు నియోజకవర్గం నుంచి “కుందురు కుటుంబం” మాత్రమే పోటీలో ఉంటుంది. ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త “కుందురు నాగార్జున రెడ్డి” కి అభినందనలు తెలియజేస్తూ గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం దురదృష్టకరం. ఆ ఓటమిని గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోకపోవడం అనేది ఒక నగ్న సత్యం. గత సార్వత్రిక ఎన్నికలలో గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అహర్నిశలు కష్టపడి పని చేసినప్పటికీ విజయం అనేది తృటిలో తప్పిపోవడం ఇప్పటికీ గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కొంత నిరాశ పడినప్పటికీ మరల నాయకులు కార్యకర్తలు కథనరంగంలోకి రావడం సంతోషకరమైన విషయం. గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త విద్యావంతుడు, సౌమ్యుడు, పశ్చిమ ప్రకాశంలోని గొప్ప రాజకీయ కుటుంబం నుంచి వచ్చి మార్కాపురం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన సూచనలు మేరకు గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. ఎన్నికలకు స్వల్ప కాలం ఉన్నప్పటికీ గిద్దలూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి అందరిని కలుపుకుంటూ విజయం కోసం సర్వ శక్తుల నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసినప్పటికీ దురదృష్టవశాత్తు స్వల్ప ఓటమి చెందినప్పటికీ నిరుత్సాహ పడకుండా మరలా నియోజకవర్గంలో కార్యకర్తలను, నాయకులను కలుపుకుంటూ అందరికీ నేను ఉన్నానని ధైర్యం ఇస్తూ పర్యటనలు చేయడం అనేది శుభ పరిమాణం అని చెప్పవచ్చు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన కుందురు నాగార్జున రెడ్డి మాత్రమే పోటీలో ఉంటాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. అధికారపక్షంలోని కొంతమంది నేతలు గిద్దలూరు నియోజకవర్గం నుంచి నాగార్జున రెడ్డి పోటీ చేయరని అపోహలు సృష్టించడం దురదృష్టకరం. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గిద్దలూరు నియోజకవర్గం నుంచి కుందురు కుటుంబం మాత్రమే పోటీలో ఉంటదని మరి ఎవరికీ అవకాశం ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు. పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందంటే అది కుందురు కుటుంబ పరిపాలనకు నిదర్శనమని చెప్పవచ్చు. కుందురు కుటుంబం పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు, ఖచ్చితంగా సుమిచితమైన స్థానం ఇచ్చి గౌరవిస్తారు.. వారికి ఎలాంటి ఆపద వచ్చినా తక్షణమే స్పందిస్తారని మార్కాపురం నియోజకవర్గం ప్రజల అభిప్రాయము. గిద్దలూరు నియోజకవర్గం కార్యకర్తలకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా “కుందురు కుటుంబం” అండగా ఉంటుందని చెప్పవచ్చు. గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా కుందురు నాగార్జున రెడ్డి మాత్రమే పోటీలో ఉంటాడని మరల విజయం సాధిస్తారని నిస్సందేశంగా చెప్పవచ్చు.