

జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నీటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందని జలమే జీవనాధారం అని నీరు లేనిదే సమస్త జీవ కోటికి మనుగడ లేదని అసలు జీవ పరిణామం ప్రారంభమైందే కాదని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సామాజిక కార్యకర్త తుమ్మ సతీష్ అన్నారు. శనివారం మునగాల మండల కేంద్రంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ…నీరు జీవనాధారం అని దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతాంగానికి నష్టాలను మిగిల్చాయనని,పంటలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని అన్నారు.